
తెలుగు ఇండస్ట్రీలో హీరోలకు ముట్టినంత రెమ్యునరేషన్ మరే యాక్టర్ లేదా టెక్నీషన్ కు ముట్టదు. కనీసం వారి దరిదాపుల్లో కూడా ఉండరు. కానీ ఈ జాబితా నుంచి ఒక దర్శకుడు మినహాయించబడతాడు. అతనే దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. బాహుబలి రెండు పార్టులకుగాను రాజమౌళి సుమారు రూ.50 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో చేస్తున్న ఆర్ఆర్ఆర్ కు రూ.30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా సమాచారం. అయితే రాజమౌళి తర్వాత ఆ జాబితా లోకి మరో దర్శకుడు చేరుతున్నాడు. అతనే కొరటాల శివ. నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు శివ చిరంజీవితో చేస్తున్న సినిమాకు రూ.15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఇండస్ట్రీలో దర్శకుడి రెమ్యునరేషన్ వారి సక్సెస్ రేట్ బట్టే ఉంటుందన్న సంగతి తెలిసిందే.