
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీ గౌరవం. దేశవ్యాప్తంగా అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరో. అతని పేరు వింటే చాలు అదిరిపోయే స్టెప్పులు, అంతులేని ఎనర్జీ, స్టైలిష్ లుక్స్ గుర్తొస్తాయి. కేవలం టాలీవుడ్ లోనే కాక, మిగితా సినీ ఇండస్ట్రీలలో కూడా అల్లు అర్జున్ కు అభిమానులు ఉన్నారంటే, బన్నీ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే అల్లు అర్జున్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ స్టైలిష్ లుక్స్, డాన్స్ కు అమ్మాయిలు ఫిదా అవ్వకుండా ఉండలేరు. తాజాగా బన్నీ-స్నేహలు తొమ్మిదివ పెళ్లి రోజును జరుపుకున్న సందర్భంగా అల్లు అర్జున్ తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. లేడీ ఫ్యాన్స్ ను లిమిట్స్ లో పెట్టడంపై తన భార్య చాలా కఠినంగా ఉందని అల్లు అర్జున్ అన్నారు. ప్రతి సంబంధంలో కొంచెం జేలసి, నా అనే భావన సహజమైనది, కాబట్టి లిమిట్స్ ను దాటడానికి తావు ఇవ్వకుండా అభిమానులను సరైన ప్లేస్ లో ఉంచుతూ స్నేహ మంచి పని చేస్తోంది.