
బిగ్ బాస్ లో అన్ని కెమెరాలకు చిక్కుతాయి అన్నది వాస్తవమే. అల...సోహెల్ మెహబూబ్ ల మూడు వెళ్ళ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అభిజీత్ ఫ్యాన్స్ సోహెల్ ను బాగానే వేసుకుంటున్నారు. అయితే తాజాగా లైవ్ లోకి వచ్చిన సోహెల్ కు ఆ వీడియో గురించి చాలా ప్రశ్నలు ఎదురైతే దానిపై క్లారిటీ ఇచ్చాడు. అభిజీత్ ఫ్యాన్స్...పిలిజ్ అర్ధం చేసుకోండి, మెహబూబ్ ఏదో మూడు వేళ్ళు చూపించాడు కాబట్టి 25 లక్షలు స్కామ్ వేసాను అంటున్నారు. అందులో ఎంతమాత్రం నిజం లేదు. నేను నా ఇంస్టా ఫాలోవర్స్ ఎంత మంది అని అడిగితే మూడు వేళ్ళు చేయించి 300k అని అన్నాడు. అయినా మెహబూబ్ కి నేను మూడో స్థానంలో ఉన్నానని ఇలా ప్రైజ్ మని అఫర్ చేస్తారని ఎలా తెలుస్తుంది? పిలిజ్ ఇప్పటికైనా అర్ధం చేసుకోండి అంటూ సోహెల్ అభిజీత్ ఫ్యాన్స్ ను వేడుకున్నాడు.