
బిగ్గెస్ట్ టెలివిజన్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో నాలుగో సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. కరోనా సమయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎంటర్టైన్మెంట్ తో పాటు మాసాల ఇవ్వడంలో సక్సెస్ అయింది. అయితే ఈ సీజన్ లో విన్నర్ కన్నా 25 లక్షలు తీసుకొని ఫైనల్ పోటీ నుంచి తప్పుకున్న సోహెల్ బాగా వైరల్ అవుతున్నాడు. ఫైనల్ ఎపిసోడ్ కూడా సోహెల్ చుట్టూనే తిరిగింది. ఇక బయటకు వచ్చాక సోహెల్ అటు నాగార్జునను ఇటు మెగాస్టార్ ను కలిసి తన కృతజ్ఞతలు తెలిపాడు. తాజాగా మెగాస్టార్ ఇంటికి వెళ్లిన సోహెల్ చిరు భార్య మరియు తల్లి తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడు ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి సోహెల్ ఈ స్టార్ లతో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు.