
పశుపతిగా 'సోను సూద్' ను ఇప్పటికి మరచిపోలేము. అంత భయంకరంగా, క్రూరంగా తాను సినిమాల్లో మాత్రమే ఉంటానని రియల్ లైఫ్ లో హీరోకు ఏ మాత్రం తక్కువ కాదని తన మంచితనంతో నిరూపించాడు, నిరూపిస్తునే ఉన్నాడు. కరోనా కష్టకాలంలో ఇంటికి దూరంగా ఉన్న ఎంతోమందిని తన సొంత డబ్బుతో బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి తమ ఇళ్లకు పంపించాడు. అంతేకాదు ఇలాంటి ఎన్నో మంచి పనులు చేస్తూ 'మనిష్య రూపేన దైవం' అనే మాటకు సార్ధకం చేస్తున్నాడు. తాజాగా మరోసారి అటువంటి గొప్ప పని మరొకటి చేసాడు. కరోనా సమయంలో చేస్తున్న సాఫ్ట్ వెర్ ఉద్యోగం పోగొట్టుకొని కుటుంబం కోసం కూరగాయల వ్యాపారం పెట్టుకున్న హైదరాబాద్ అమ్మాయి శారదాను సోను సూద్ సంప్రదించి ఆమెను ఇంటర్వ్యూ చేసి ఒక ఉద్యోగం ఇప్పించాడు. దింతో మరోసారి నెటిజన్లు సోను సూద్ ను సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.