
బిగ్ బాస్ సీజన్ 4 లో అందరికన్నా ఎక్కువ వార్తల్లో నిలిచిన కంటేస్టెంట్ మోనాల్ గజ్జర్. ఆమెపై వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఆమె క్యారెక్టర్ పై నిందలు వేస్తూ పర్సనల్ గా ఎటాక్ చేస్తూ ఘోరంగా టార్గెట్ చేస్తున్నారు. వృత్తి రీత్య ఆమె హీరోయిన్ దింతో వీకెండ్ ఎపిసోడ్లలో కొంత ఎక్స్పోజింగ్ బట్టలు వెయ్యడంతో ఆమె వ్యక్తుత్వాన్ని దెబ్బతిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక దినికి తోడు మోనాల్ ఇంట్లో అఖిల్, అభిజిత్ తో డబుల్ గేమ్ అడుతుందని ప్రేక్షకులకే కాదు ఇంట్లోని సబ్యులకు కూడా అనిపించింది. కానీ అక్కడ ఆమె తప్పు ఏమి లేదు. వచ్చి రాని తెలుగుతో ప్రేక్షకులకు మరింత దూరమైంది. అయితే మోనాల్ ను టార్గెట్ చేయటం తెట్టుకోలేని ఆమె అభిమానులు యాక్టర్ సోనూసూద్ ను ఆమెకు సపోర్ట్ చేయమని కొరుకుతూ వారు కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరి సోనూసూద్ దినిపై ఎలా స్పందిస్తారో చూడాలి.