
గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'విన్నైతండి వరువాయ' తెలుగులో ఏ మాయచేసావేను అందించి పదేళ్ళు అయ్యింది. ఇందులో సింబు, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడి ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా మారేందుకు కారణమైంది. గౌతమ్ మీనన్ కు మంగళవారం 47ఏళ్ళు వచ్చాయి. ఈ సందర్భంగా అతను మీడియా మరియు అభిమానులతో ముచ్చటించాడు. మీడియా వారిలో ఒకరు 'విన్నైతండి వరువాయ 2' దర్శకత్వం వహించే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగగా, దర్శకుడు ఒరిజినల్ యొక్క సీక్వెల్ పనులను ప్రారంభించానని సమాధానం ఇచ్చారు. వచ్చే పదేళ్లపాటు కార్తీక్ (సింబు) ఏమి చేస్తారనే దానిపై ఆధారపడి ఈ చిత్రం ఉంటుందని ఆయన వెల్లడించారు. సింబు తన కథను అంగీకరిస్తే సినిమా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నానని దర్శకుడు తెలిపారు. అలాగే, కథ తన పాత్ర కార్తీక్ ఆధారంగా ఉన్నందున సింబు మాత్రమే ఈ పాత్రను పోషించగలడని తాను భావిస్తున్నానని చెప్పాడు.