
ఘానా ఘంధర్వడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కరోనా భారిన పడి చెన్నై ఆసుపత్రిలో చేరి కొద్దీ రోజులకు ఆరోగ్యం విషమం కావడంతో వెంటిలేటర్ పై ఉంచి ప్రత్యేక వైద్య సిబ్బంది చికిత్స అందిస్తూ వచ్చారు. దేశం నలుమూలల నుంచి బాలు గారు కోలుకోవాలని ప్రార్ధనలు చేసారం అయితే బాలు కొడుకు ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్తితిపై అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఆగస్టు నెలలో కరోనా నెగిటివ్ గా తేలిందని చెప్పగా ఇంకా వెంటిలేటర్ పై ఉన్నారు కానీ స్పందిస్తున్నారని తెలియజేసారు చరణ్. అలా...తాజాగా ఇచ్చిన ఆ0డేట్ ప్రకారం, బాలు గారు 15 నుంచి 20 నిమిషాలు పాటు కుర్చీలో కూర్చోగలుగుతున్నారని అంతే కాకుండా ఆహరం కూడా తీసుకోగలుగుతున్నారని ఫిజియో థెరపీ కు కూడా బాగా స్పందిస్తున్నారని వారు తెలిపారు. ప్రస్తుతానికి అయితే అంతా బాగానే ఉందని ఒక పాజిటివ్ వార్తను ఆయన అభిమానులకు అందించారు.