
చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్‌లో ఎస్పీబీ కరోనావైరస్ చికిత్స పొందుతూ, ఆరోగ్యం మరింత దిగజారడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ పై ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి అభిమానులు మరియు శ్రేయోభిలాషులకు చెప్తూ కుమారుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. SPB ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల లేదని ఆయన అన్నారు. వీడియోలో, ఎస్పీ చరణ్ మాట్లాడుతూ, “ఇప్పటివరకు నా తండ్రి ఆరోగ్యంలో పెద్దగా అభివృద్ధి లేదు. కాబట్టి దీని గురించి చెప్పడానికి ఎక్కువ లేదు. కానీ నేను చెప్పినట్లు, ఆయన ఆరోగ్యంగా తిరిగొస్తారన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని మేము కోల్పోలేదు. నాన్నపై మరియు మా కుటుంబం బాగుండాలని మీరు చేస్తున్న ప్రార్థనలు వీలైనంత త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయని మాకు నమ్మకం ఉంది. ఎస్పీ బాలు గారు ఆరోగ్యంగా ఉండాలని దేశం నలుమూలల నుంచి ప్రాధిస్తున్న ఫిల్మ్ ఇండస్ట్రీ సభ్యులకు, అభిమానులకు నా ధన్యవాదాలు. మీ ఆశీసులు, ప్రార్ధనలు ఎక్కడికి పోవనే నమ్మకం ఉందని" అన్నారు.
మన అందరం మరోసారి, బాలు గారు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా, ఆనందంగా ఇంటికి రావాలని మనసారా కోరుకుందాం.