
కరోనా వైరస్ పరీక్షా చేయించుకొనగా పాజిటివ్ అని తేలిందంటూ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బుధవారం ఆసుపత్రి నుండి ఒక వీడియోను విడుదల చేశారు. తనకు జ్వరం, జలుబు, ఛాతీ రద్దీ ఉందని, దీంతో నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ -19 పరీక్ష చేయించుకున్నని వెల్లడించారు. వైద్యులు సెల్ఫ్ ఐసొలేట్ మరియు మందులను సూచించారని తెలిపారు. అయితే, అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నందున ఎస్పీబీ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాలని నిర్ణయించుకున్నారు. గాయకుడు, తన జ్వరం తగ్గిందని, ఇప్పుడు అతనికి జలుబు మాత్రమే ఉందని చెప్పారు. రెండు రోజుల్లో అతని లక్షణాలు తొలగిపోతాయని ఎస్పీబీ ఆశాభావం వ్యక్తం చేశారు.