
ఫెమస్ యాంకర్ అయిన శ్రీముఖి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మంచి స్నేహితులు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్3 లో అడుగు పెట్టారో...మెల్ల మెల్లగా వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా గడిపిన రోజులు ఉన్నాయి. శ్రీముఖి అయితే నీతో బయట కూడా మాట్లాడేది లేదంటూ రాహుల్ కు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక రాహుల్, శ్రీముఖి టాప్ 2లో నిలవగా రాహుల్ విన్నర్ గా, శ్రీముఖి రన్నరప్ గా నిలిచారు. అయితే రాహుల్ గెలవడానికి ఒకరకంగా శ్రీముఖే కారణమైందని అన్నవారు లేకపోలేదు. ఇంట్లో ఉన్నంత కాలం అతన్ని టార్గెట్ చేస్తూ అతనికి సింపతి పెరిగేలా చేసిందని అన్నారు. ఇదిలా ఉండగా బయటకు వచ్చాక కూడా వారి మధ్య గొడవ అలానే కొనసాగింది. శ్రీముఖికి ఏదో షో కోసమని ఫోన్ చేస్తే ఆమె పట్టించుకోలేదని రాహుల్ బహిరంగంగానే చెప్పాడు. కానీ ఇప్పుడు సిన్ మారినట్లుగా ఉంది. ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసి "గతం గతః" అనే క్యాప్షన్ ను ఉంచారు. అంతే కాదు వరుణ్ సందేశ్, వితికా, రాహుల్, శ్రీముఖి కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో రాహుల్, శ్రీముఖి కలిసి చిందులేశారు. దీంతో వీరి మధ్య విబేధాలు తొలిగిపోయాయని తెలుస్తోంది.