
తెలుగు బుల్లితెరపై తమదైన శైలి యాంకరింగ్‌తో చాలా కాలంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు హాట్ బ్యూటీలు శ్రీముఖి, విష్ణు ప్రియ. అల్లరితో ఆకట్టుకుంటూనే హాట్ అందాలతో మత్తెక్కిస్తూ స్పాంటీనియస్‌గా పంచులు పేలుస్తూ తమ సామర్థ్యంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు. ఇదిలాఉండగా, తాజాగా జరిగిన ఓ షోలో... జబర్ధస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ చేసిన పొరపాటు కారణంగా ఈ ఇద్దరు యాంకర్లకు ఊహించని పరిణామం ఎదురైంది. సీనియర్ యాక్టర్ సాయి కుమార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'Wow-మంచి కిక్కిచ్చే గేమ్ షో' వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రాంప్రసాద్... యాంకర్ విష్ణు ప్రియను వెనుక నుంచి తోసేయడంతో కింద పడిపోయింది. దీంతో ఆమె చేతులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాకయ్యారు. అదే సమయంలో ‘సిగ్గులేదా... అసలు వీడిని ఎవరు రమ్మన్నారు' అంటూ శ్రీముఖి ఫైర్ అయింది.