
బుల్లితెరపై యాంకర్ గా చెరగని ముద్ర వేసిన వారిలో శ్రీముఖి కచ్చితంగా ఉంటారు. ఎంతో చలాకీగా స్టేజ్ మీద హై ఎనేర్జిటిక్ గా ఉంటూ అందరిని అలరిస్తుంది. శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లోకి వచ్చి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అంతేకాదు ఈ సీజన్ ద్వారా శ్రీముఖి పర్సనల్ లైఫ్ గురించి తెలిసింది. అప్పుడు తాను ఒక్క అబ్బాయిని ప్రేమించానని కానీ ఆ అబ్బాయి తనను అర్ధం చేసుకోవడం ఫెయిల్ అయ్యాడని విడిపోయారని తన సాడ్ స్టోరీ చెప్పింది. అయితే మళ్ళీ ఇన్నాళ్లకు శ్రీముఖి గ్లామర్ ఫీల్డ్ కు చెందిన ఒక అబ్బాయిని ప్రేమిస్తుందని త్వరలో పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తుంది. తాజా ఇంటర్వ్యూలో నేను ఒకరిని ప్రేమిస్తున్న కానీ అతను ఎవరు ఏంటి అనేది అప్పుడే చెప్పలేనని అనింది. చూద్దాం మరి త్వరలో తీపి కబురు చెబుతుందేమో.