
బుల్లితెరపై నాలుగు ఐదు యాంకర్ల పేర్లు, మొహాలు తరుచు కనపబడుతుంటాయి వినబడుతుంటాయి. అందులో శ్రీముఖి ఒకరు. శ్రీముఖి చేలకితనం గురించి ఎంత చెప్పిన తక్కువే. అయితే ఈమె మరో యాంకర్ విష్ణుప్రియ మంచి స్నేహితులు. శ్రీముఖి బిగ్ బాస్ నుంచి వచ్చిన అనంతరం ఈ ఇద్దరు తమ స్నేహితులతో కలిసి మాల్దీవులకు చెక్కేసిన సంగతి తెలిసిందే. అయితే శ్రీముఖి అవినాష్ లు మంచి స్నేహితులు. దింతో బిగ్ బాస్ సీజన్ 4 కు వెళ్లొచ్చిన అవినాష్ ద్వారా బోల్డ్ పాప కూడా క్లోజ్ అయింది. అంతే ఇంకేముంది ఖాళీ సమయం దొరకగానే శ్రీముఖి, విష్ణుప్రియ, అరియనాలు గోవాకు చెక్కేశారు. అక్కడ ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాల్లో రచ్చ చేస్తున్నాయి.