
'శ్రీరెడ్డి' ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదేమో. మాములుగా అయితే శ్రీరెడ్డి ఎవరో ఎవరికి తెలీదు. కానీ ఆమె చేసిన నిరసనలు, సెలెబ్రెటీలపై చేసిన ఆరోపణలు, ఫిల్మ్ ఛాంబర్ ముందు చేసిన రచ్చ కారణంగా ఇప్పుడు ఇమే అందరికి సూపరిచితురాలైంది. కొన్ని రోజుల పాటు మీడియాలో ఇమేనే హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ తర్వాత కొంత సైలెంట్ అయ్యి...అప్పుడప్పుడు నేను ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. ఇక తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాను టార్గెట్ చేసింది. తమన్నా నటిస్తున్న "ది నవంబర్ స్టోరీ" వెబ్ సిరీస్ షూటింగ్ శ్రీరెడ్డి ఇంటి పక్కనే జరుగుతుంది. దీంతో ఫెస్ బుక్ వేదికగా "తమన్నా వెబ్ సిరీస్ షూటింగ్ నా ఇంటి పక్కనే జరుగుతుంది. గత 10 రోజులుగా ఆ రచ్చను ఓర్చుకుంటున్నా...ఇక ఓపిక పట్టలేను. రేపు తమన్నా వెబ్ సిరీస్ టీం సంగతి చెప్తా" అంటూ పోస్ట్ చేసింది.