
నాగ శౌర్య ప్రతిభావంతులైన నటుల్లో అతను ఒకరు. నటుడు నాగ శౌర్య ఎప్పుడూ విభిన్న విషయాల ఆధారంగా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. 2011 సంవత్సరంలో ‘క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్’ చిత్రంతో అరంగేట్రం చేసిన శౌర్య 2014 లో ‘చందమామ కథలు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడటం లేదు. అయితే తాజాగా శౌర్య నటించిన చిత్రం 'అశ్వద్దామా' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సినీ ప్రేమికుల నుండి మంచి స్పందన వస్తోంది. నటనతో పాటు, కథను కూడా శౌర్యానే రాయడం విశేషం. అయితే వివాదాస్పద నటి శ్రీ రెడ్డి నాగ శౌర్యపై సోషల్ మీడియా వేదికగా పలు వ్యాఖ్యలు చేసింది. నాగ శౌర్య గురించి తన ఫేస్బుక్లో ఇలా రాశారు, "నాగ శౌర్య లాంటి ప్రతిభావంతులైన మరియు అందమైన హీరోలను తోక్కకండి రా తోక్కలో మెగా హీరోస్ కోసం." శ్రీ రెడ్డి మెగా బ్రదర్ నాగబాబు, పవన్ కళ్యాణ్ పై గతంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వారిని టార్గెట్ చేస్తూ పోస్ట్ చేసింది.