
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ గురించి తెలియని వాళ్లు ఉండరు. స్టార్ హీరో, హీరోయిన్లతో సినిమాలు తీస్తూ మరోపక్క పార్టీలు, ఈవెంట్, షోలు అంటూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన శ్రీదేవి గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కరణ్ జోహార్ నిర్మించిన కలంక్ చిత్రంలో శ్రీదేవి నటించాల్సి ఉంది. కానీ ఆమె హఠాత్తుగా మరణనించడంతో మాధురి దీక్షిత్ ను శ్రీదేవి స్థానంలో తీసుకున్నారు. ఈ విషయమై కరణ్ మాట్లాడుతూ "కలంక్ సినిమాకు సైన్ చేసేముందే శ్రీదేవి కొన్ని మార్పులు చేర్పులు చేస్తే సినిమా బాగుంటుందని చెప్పారు. ఆ తర్వాత మాధురి దీక్షిత్ తో చేయాల్సి వచ్చింది. కానీ సినిమా ప్లాప్ అయింది. శ్రీదేవి చెప్పిన మార్పులు చేసుంటే సినిమా హిట్ అయ్యేది. తను లేకపోవటంతో నేను ఆ మార్పులు చేయలేదని" చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రస్తుతం కరణ్ జోహార్ భారీ తారాగణంతో "తక్త్" అనే సినిమాను నిర్మిస్తున్నారు.