
హీరో మంచు విష్ణు చదరంగం అనే వెబ్ సిరీస్ తీస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కు రాజ్ అనంత దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ త్వరలో 'ZEE 5' ఓటీటీలో మరికొన్ని రోజుల్లో ప్రసారం కానుంది. నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మరియు పూర్వపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఒక తెలియని సంఘటనను 'చదరంగం' ప్రదర్శిస్తుంది. ఆ సంఘటన గురించి కేవలం అతని సన్నిహితులకు మాత్రమే తెలుసు. చదరంగంలో హీరో శ్రీకాంత్ ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్నారు. నాగినీడు, రవిప్రక్ష్, చలపతి రావు, జీవ, సునైనా, కౌసల్య, రమ్య పసుపులేటి చదరంగంలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. టాలివుడ్ లో మంచు ఫ్యామిలీ అంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇదివరకు మంచు ఫ్యామిలీ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో మంచు విష్ణు సినిమాలు పరాజయం పాలవుతున్నాయి. అందుకే సినిమాలను కొద్ది కాలం పక్కన పెట్టి, వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ పొందాలని బలంగా ప్రయత్నిస్తున్నాడు. మరి విష్ణు కోరిక నెరవేర్తుందో లేదో చూడాలి.