
బాహుబలి లాంటి తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ సినిమా అందించిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో RRR సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే కరోనా విపత్తు రావటంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. తాజాగా అందరికి షాక్ ఇస్తూ తాను మరియు కుటుంబ సభ్యులు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందంటూ జక్కన్న ట్వీట్ చేసారు. ఇది చూసి నెటిజన్లు ఒక్కసారి బిత్తరపోయారు. కరోనా ఎంత దారుణంగా వ్యాప్తి చెందుతుందో ఈ సంఘటనలు చూస్తే అర్ధం అవుతుంది. ఎన్నో జాగ్రత్తలు పాటించినప్పటికీ సెలెబ్రిటీలు సైతం దీని భారిన పడుతున్నారు. అయితే తమకు కొంచెం జ్వరంగా ఉండటంతో టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. కానీ ఇప్పుడు మాకు ఎటువంటి లక్షణాలు లేవు. డాక్టర్లు సూచించినట్లుగా మేము ఇంట్లోనే ఐసొలేట్ అవుతున్నామని రాజమౌళి తెలిపారు. మన దర్శక ధీరుడు మరియు కుటుంబ సభ్యులు త్వరగా కోలుకొని రేటింపు ఉత్సాహంతో రావాలని కోరుకుందాం.