
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరూ' తర్వాత పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' లో నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన మహానటి ఫెమ్ కీర్తి సురేష్ నటించనుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ కోసం ప్రత్యేకమైన సెట్ ను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి అవ్వగానే టీం అంత యుఎస్ వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరియు దర్శకుడు పరుశురాం ఇప్పటికే మూడు పాటలను ఫైనల్ చేశారట. సరిలేరు నీకెవ్వరు సినిమాపై తమన్ వేసిన కామెంట్లు మహేష్ ఫ్యాన్స్ ను బాగానే హార్ట్ చేసాయి. దీంతో వాటిని మర్చిపోయేలా ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ ను రెడీ చేస్తున్నారట. ఇకపోతే ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు పరుశురాం.