
హైదరాబాద్ లో హఠాత్తుగా జిఎస్టీ అధికారులు ప్రముఖుల ఇళ్లపై సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సినీ నటి లావణ్య, ప్రముఖ యాంకర్లు సుమ, అనసూయ ఇళ్లపై కూడా అధికారులు సోదాలు నిర్వహించారని జోరుగా ప్రచారం సాగింది. దీనిపై మీడియాలో రకరకాల కధనాలు రావటంతో సోషల్ మీడియా వేదికగా యాంకర్ అనసూయ మీడియాను ఏకిపారేసింది. అయితే ఇప్పటికి జిఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు హారిక అండ్ హాసిని మేకర్స్ కు త్రివిక్రమ్ అత్యంత సన్నిహితంగా ఉండే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంట్లోనూ జిఎస్టీ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.