
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. కానీ ఆంద్రప్రదేశ్ లో జరిగిన గత ఎన్నికల్లో పవన్ ఉహించినట్టు జరగకపోవడంతో మళ్ళీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈమేరకు బి టౌన్లో హిట్ అయిన 'పింక్' రీమేక్ లో నటిస్తున్నారని సమాచారం. అసలు విషయానికొస్తే పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వస్తే చేసేందుకు ఎంతోమంది క్యూలో వెయిట్ చేస్తుంటారు. కానీ పవన్ తో నటించేందుకు ఒక స్టార్ హీరో నిరాకరించాడట. అది మరెవరో కాదు మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి. అల్లు అరవింద్ మమ్ముట్టికి ఫోన్ చేసి...మీరు పవన్ సినిమాలో విలన్ గా నటించగలరా? అని అడగగా...మమ్ముట్టి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారట. ఇదే ప్రశ్న మీరు చిరంజీవిని అడగగలరా ? అని మమ్ముట్టి ఎదురు ప్రశ్న వెయ్యడంతో అల్లు అరవింద్ అడగలేనని చెప్పడంతో మమ్ముట్టి కామ్‌గా ఫోన్ పెట్టేసారట. ఈ విషయాన్నీ అల్లు అరవింద్.. ‘మామాంగం’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో వెల్లడించారు.