
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పటికి అందచెందాలతో, అభినయంతో అలరిస్తూ చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. స్టార్ సీనియర్ హీరోలకు ఇమేనే బెస్ట్ ఛాయిస్ అయింది. ఒక పక్క వరుసగా సౌత్ సినిమాలు చేస్తూనే మరోపక్క ఈవెంట్లు, కార్యక్రమాలు అంటూ చాలా బిజీగా సిటీలు తిరిగేస్తుంది. అలా తిరిగే సమయంలో కాజల్ అనుకోని అతిధిని కలిసింది. అది మరెవరో కాదు రాజమౌళి భార్య రామ రాజమౌళిని తను ప్రయాణిస్తున్న ఫ్లైట్ లో చూసి ఒక్కసారిగా ఆమెను హత్తుకొని ముద్దు పెట్టేసింది. ఆ సన్నివేశాన్ని సెల్ఫీ తీసిన కాజల్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంది. "నా ప్రియమైన వ్యక్తులను అనుకోకుండా ఫ్లైట్ కోలుకోవడం నాకెంతో నచ్చుతుంది. కొన్నిరోజుల ముందు తలుచుకున్న వారు సడన్ సర్ప్రైజ్ గా మన పక్కనే కూర్చోవడం ఎంతో బాగా అనిపిస్తుంది. ఎప్పటిలానే అంతులేని ముచ్చట్లు రామా రాజమౌళి గారు" అంటూ తన తీసిన సెల్ఫీలను పోస్ట్ చేసింది.