
బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికి 4 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులకు ఒకరు నచ్చి ఓట్లేసి గెలిపించినా యాజమాన్యం మాత్రం ఎవరి వల్ల టిఆర్పి వస్తుందనేది పరిగణంలోకి తీసుకుంటుంది. అందుకే కావచ్చు ఈ సీజన్ మొత్తం ట్రయాంగిల్ లవ్ స్టోరీలతో చివరి దాక మసాలా కంటెంట్ ఇచ్చిన మోనాల్ గజ్జర్ కు స్టార్ మా యాజమాన్యం బంపర్ అఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. స్టార్ మాలో ప్రసారం కాబోతున్న డ్యాన్స్ ప్లస్ రియాల్టీ షోలో జడ్జ్ గా అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. అది కూడా భారీ మొత్తానికి ఆమెను తీసుకున్నారని సమాచారం. ఇకపోతే సిగ్గరేని ముద్దుబిడ్డ సోహెల్ చివరి నిమిషం దాక అందరిని ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు. అందుకుగాను స్టార్ మా యాజమాన్యం వచ్చే బిగ్ బాస్ సీజన్ 5 బిగ్ బాస్ బజ్ షోను సోహెల్ తో నిర్వహించాలని ఫిక్స్ అయ్యారట. దానికి సోహెల్ కు భారీ రెమ్యునరేషన్ అఫర్ చేసినట్లు తెలుస్తుంది.