
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని సంవత్సరాలుగా వెండితెరకు దూరంగా ఉన్నారు. బ్రేక్ తీసుకున్నప్పటికీ రికార్డులు బద్దలు కొట్టేందుకు తిరిగి "వకిల్ సాబ్" గా వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం మేకర్స్ 'వకీల్ సాబ్' యొక్క ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో పవన్ తన విలక్షణమైన బాడీ లాంగ్వేజ్‌తో క్యాజువల్ గా, స్టైలిష్‌గా ఒక ఆటోలో కూర్చొని బుక్ చదువుతున్నట్లు కనిపిస్తున్నారు. ఈ లుక్ చూసి అభిమానులు పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అంటూ సంబరపడుతున్నారు. టైటిల్ సూచించినట్లుగా, పవన్ వకీల్ సాబ్ లో న్యాయవాది పాత్ర పోషిస్తాడు. ఈ సినిమా ప్రశంసలు పొందిన బాలీవుడ్ కోర్టు రూమ్ డ్రామా పింక్ చిత్రంకు రీమేక్. 2018 సంక్రాంతికి విడుదలైన తన చిత్రం 'అజ్ఞతవాసి' తర్వాత గ్యాప్ తీసుకున్న పవన్ తిరిగి రావడానికి వకిల్ సాబ్ సరైన సినిమా అని భావించాడు. శ్రీరామ్ వేణూ వకీల్ సాబ్ కు దర్శకత్వం వహిస్తుండగా, బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.