
అల్లు అర్జున్ మరియు అతని కుటుంబంలో బుధవారం నాడు విషాధచాయలు నెలకొన్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మామయ్య, దగ్గరి బంధువులలో ఒకరు ముత్తాంశెట్టి రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారు. అతను విజయవాడలో బుధవారం ఉదయం చివరి శ్వాస విడిచారు. అతను తీవ్రమైన గుండెపోటుతో బాధపడి కన్నుమూశారు. ముత్తాశెట్టి రాజేంద్ర ప్రసాద్ అల్లు అర్జున్ తల్లి అల్లు నిర్మల తమ్ముడు. రాజేంద్ర ప్రసాద్ గతేడాది వార్తల్లో నిలిచారు. అతను అల్లు అర్జున్ సుకుమార్ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ తో సంయుక్తంగా నిర్మించనున్నారని వార్తలొచ్చాయి. అతని సినీ అరంగేట్రం గురించి కుటుంబం మొత్తం ఉత్సాహంగా ఉండగా, అతని ఆకస్మిక మరణం అందరినీ షాక్కు గురిచేసింది. ఈ విషాద వార్త విన్న అల్లు కుటుంబం మొత్తం విజయవాడకు బయలుదేరారు. అల్లు అర్జున్, అతని తల్లి నిర్మలా, నాన్న అల్లు అరవింద్ మరియు ఇతరులు ఆయనకు చివరి నివాళులు అర్పించడానికి విజయవాడ వెళ్లారు.