
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, హీరో సుధీర్ బాబు 'V' అనే పేరుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో ఇక ప్రమోషన్స్ పై ఫాక్స్ పెట్టాలని డిసైడ్ అయింది. ఈ మేరకు తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్లను ఎప్పుడు రిలీజ్ చేయనున్నారో వెల్లడించింది బృందం. మొదట జనవరి 27న సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ను విడుదల చేసి ఆ తరువాత 28న నాని ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. 'V' లో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నాని విలన్ గా కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు సుధీర్ బాబు పోలీసు అధికారిగా, నాని మంచి వాడుగా ఉండి తర్వాత చెడ్డ వాడిగా మారిపోయే అబ్బాయిలగా కనిపించనున్నారు. జెంటిల్మాన్ తరువాత, నేచురల్ స్టార్ నాని మరియు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి మరోసారి కలిసి వస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా థామస్,ఉగాది సందర్భంగా మార్చి 25 న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.