
పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న'సర్కారు వారి పాట' చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది నుంచి మొదలు కానుంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తుండగా, ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా సుధీర్ బాబు కనిపించనున్నారని సమాచారం. సుధీర్ బాబు ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలుసుతుంది. కానీ అది ఎటువంటి పాత్ర అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు. ఇకపోతే సుధీర్ బాబు తాజాగా నాని హీరోగా వచ్చిన 'V' సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించి అలరించారు. V లో సుధీర్ బాబు నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. తాజాగా అతని మరో చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్' లాంచ్ అయింది. ఇక ఇప్పుడు మహేష్ తో కూడా స్క్రీన్ లో కనిపించనున్నారనే సరికి ఘట్టమనేని ఫ్యాన్స్ కు పండగే