
జోర్దార్ సుజాత ప్రముఖ టీవీ హోస్ట్లలో ఒకరు. ఆమె బిగ్ బాస్ సీజన్ 4 లో కంటేస్టెంట్ గా వెళ్లి తెలంగాణ మాండలికంతో ప్రేక్షకులను అలరిస్తు వచ్చింది. మీ అందరికీ తెలిసినట్లుగా, ఐదవ వారంలో సుజాత ఎలిమినేట్ అయింది. కొనసాగుతున్న గుసగుసల ప్రకారం, సుజాతను చాలా కాలం క్రితం ఎలిమినేట్ చేయాల్సి ఉంది, కాని ఆమె నామినేషన్ జాబితాలో లేనందున ఆమె కాలేదు. గత వారం మాత్రం తప్పించుకోలేకపోయింది. అయితే సుజాత మొదటి నుంచి హోస్ట్ నాగార్జునను 'బిట్టు' అని పిలిచి ఎవరు చేయలేని ధైర్యం చేసింది. ఆమె నిన్ను బిట్టు అని పిలుస్తానని చెప్పడంతో నాగార్జున కూడా ఏమి అనలేక సరేనని ఊరుకున్నాడు. కానీ ఆమె అలా ప్రతి వీకెండ్ నాగార్జున కనిపిచినప్పుడల్లా బిట్టు అని పిలవడం నెటిజన్లకు నచ్చలేదు. దీనిపై కాస్త వ్యతిరేకత వచ్చింది. ఇక తాజాగా ఇంటి నుండి బయటకు వచ్చిన సుజాత ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. సెలెక్షన్ ప్రక్రియలో "నీకు నాగార్జున అంటే ఇష్టమా అని అడిగితే. నాకు చాలా ఇష్టం ఇంకా నాగార్జున పోషించిన బిట్టు పాత్ర అంటే చాలా ఇష్టమని చెప్పా. అప్పుడు బిగ్ బాస్ టీం నాగార్జునను బిట్టు అనే పిలవమన్నారు" అందుకే నేను అలా పిలిచేదాని. దీని వల్ల అభిమానులు ఫీల్ అయ్యుంటే నన్ను క్షమించండి అంటూ వివరణ ఇచ్చింది సుజాత.