
సినీ జీవితం ఎప్పుడు సరిపోతుందో తెలియని దీపం లాంటిది. అందుకే మనం ఫామ్ లో ఉన్నప్పుడే పేరుతో పాటు డబ్బు సంపాదించుకోవాలి. ఒక్కదాన్ని పట్టుకొని కూర్చుంటే ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. అది బాగా అర్ధం చేసుకున్నాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. మలయాళం హిట్ 'లూసిఫెర్' తెలుగు రీమేక్ కు మొదట మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ సుజీత్ ను అనుకున్నప్పటికీ తర్వాత చిరంజీవి సుజీత్ ను పక్కన పెట్టేసారు. దీంతో సుజీత్ నెక్స్ట్ ప్లాన్ పై ఫోకస్ పెట్టాడు. పోయిన అవకాశం గురించి ఆలోచించకుండా రాబట్టుకోవాల్సిన అవకాశంపై దృష్టి పెట్టాడు. సుజీత్ తాజాగా యువి క్రియేషన్స్ ను కలిసి సినిమా తీసే అవకాశం ఇవ్వమని అడగగా.....సరేనని, హీరో గోపీచంద్ లేదా శర్వానంద్ కు తగ్గ కథను సిద్ధం చేయమని చెప్పారట. మరి సుజీత్ మంచి కథతో మళ్ళీ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.