
అల్లు అర్జున్, రష్మీక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం, షూటింగ్లు నిలిచిపోవడం పుష్ప వెనక్కి వెళ్ళింది. ఇక ఇన్ని నెలలకు గాను ప్రభుత్వం షూటింగ్లకు అనుమతించడంతో పుష్ప టీం సెప్టెంబర్ లో షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంది. అయితే ఒక్కసారి షూటింగ్ మొదలుపెడితే ఏకధాటిగా 50రోజుల పాటు షూట్ నిర్వహించాలని సుక్కు ఫిక్స్ అయ్యారట. ఈమేరకు తగిన ఏర్పాట్లు చేయాలని టీంకు చెప్పారట. 50 రోజుల్లో సినిమాకు సంబంధించిన మేజర్ పోర్షన్ ను షూట్ చేయనున్నారు. అంటే అల్లు అర్జున్ ఖచ్చితంగా 45 రోజుల పాటు షూట్ లో పాల్గొనాల్సి ఉంటుంది. సుక్కు వేసిన ఈ ప్లాన్ కు బన్నీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.