
మ్యూజిక్ డైరెక్టర్లు మంచి ఆల్బమ్ ఇచ్చారంటే వాళ్లకు, సినిమాకు ఎంతో మేలు జరుగుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ మంచి పాటలు అందించాలంటే కొంత సినిమా డైరెక్టర్ చేతుల్లో కూడా ఉంటుంది. నాకు ఇలాంటి సందర్బానీకి ఇలాంటి పాటలు కావాలని అడిగి మరీ దగ్గరుండి కంపోజ్ చేయించుకుంటారు. అలా చేసే సుకుమార్- దేవి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజిక్ ఆల్బమ్ మంచి హిట్ అయింది. అలానే వీరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతూ వచ్చింది. అందుకేనేమో నేను దేవిశ్రీ ప్రసాద్ ను వదిలే సమస్యే లేదంటున్నాడు సుక్కు. తాజాగా మహేష్ సినిమా సరిలేరు నీకెవ్వరుకు దేవిశ్రీ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ఆ పాటలు అభిమానులను మెప్పించలేకపోయాయి. అయినా సరే దేవినే నమ్ముకుంటున్నాడు సుకుమార్. అల్లు అర్జున్ తో సుకుమార్ సినిమా తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంకు కూడా దేవికే ఛాన్స్ ఇచ్చాడు. మరి సుక్కు నమ్మకాన్ని దేవి నిలబెడతాడో లేదో చూడాలి.