
కరోనా లాక్డౌన్ సమయంలో ఎంతోమంది జీవనోపాధి కోల్పోయారు. అందులో మరి ముఖ్యంగా షూటింగ్ ల మీద బ్రతికే టెక్నీషియన్లు, ఆర్టిస్ట్‌లు ఉన్నారు. మహామహులు అయిన చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు లాంటి వాళ్ళు కూడా చేసేదేమీ లేక ఇంట్లో కూర్చువాల్సిన పరిస్థితి. కానీ యాంకర్ సుమ మాత్రం అందుకు భిన్నం. కరోనా ఉన్నా లేకపోయినా తేడా లేదన్నట్టుగా దుమ్మురేపుతోంది. లాక్డౌన్ సమయంలో కాళిగా ఉండటం ఎందుకని ఆమె యుట్యూబ్ ఛానెల్ 'సుమక్క' లో వంటలతో ఊరిస్తూ, బుల్లితెర యాంకర్లతో గేమ్ షోలు పెడుతూ, డ్యాన్స్‌లు వేసి తన కుక్కను కూడా ఎంటర్టైన్ చేస్తూ ఈ సమయంలో ఎవరు గడపలేనంతగా బిజీగా గడుపుతుంది. ఇక ఇప్పుడు ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతిచ్చాక నిమిషం ఆలస్యం చేయకుండా రెండు చేతుల సంపాదిస్తుంది. ఇప్పటికే ఈటీవీలో క్యాష్ ప్రసారమవుతుండగా తాజాగా స్టార్ మహిళ ప్రారంభిస్తున్నట్లు ప్రోమో ద్వారా ప్రకటించింది. దీంతో పాటు ఇంటి నుంచే పలు రకాల యాడ్లు చేయటం, వేరే ప్రోగ్రాంలకు గెస్ట్ గా వెళ్తూ తన షెడ్యూల్ ను ఫుల్ టైట్ గా ఫిక్స్ చేసింది. ఇవన్నీ చూసి ఇటువంటి టైంలో కూడా సుమ ప్లానింగ్ కి అవ్వాక్ అవుతున్నారు. ఇన్ని ఏళ్ళు గడిచినా ఆమె క్రేజ్ తగ్గకపోవడం కాక కరోనా లాంటి వ్యాప్తి చెందే వైరస్ సోకి అంతా అల్లాడుతున్న సమయంలోనూ సుమ షెడ్యూల్ షాక్ కి గురిచేస్తుంది.