
కమెడియన్ సునీల్ తనకంటూ టాలీవుడ్లో ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అతని కామెడీ టైమింగ్, హుమర్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సీనియర్ నటుల దగ్గర నుంచి జూనియర్ నటుల వరకు అందరితో నటించి వాళ్ళపై పంచ్‌లు వేస్తూ, అన్ని రకాల హావభావాలతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కమెడియన్ నుంచి హీరోగా మారి "అందాల రాముడు" సినిమాలో నటించాడు. అది కామెడీ బాగుండడంతో పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇక ఆపై వచ్చిన సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "మర్యాద రామన్న" మంచి విజయాన్ని సాధించింది. కానీ అది కూడా రాజమౌళి ఖాతలోనే చేరింది. హీరోగా సునీల్ కు వచ్చిన గుర్తింపు తక్కువే. అందుకేనేమో ఇంకో భిన్నమైన టర్న్ తీసుకున్నారు. నటుడు సుహాస్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో ‘కలర్ ఫోటో’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ ప్రేమ కథలో సునీల్ విలన్ పాత్రలో కనిపిస్తారట. మరి సునీల్ తీసుకుంటున్న ఈ కొట్ట టర్న్ ఎలా ఉంటుందో చూడాలి.