
హాస్యనటుడు సునీల్ ప్రధాన నటుడిగా మారినప్పటికీ సినీ ప్రేమికులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడ. అతను హీరోగా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఫెయిల్ అయ్యాయి. అతను ప్రధాన పాత్రలు పోషిస్తున్నప్పుడు 2 కోట్ల నుండి 3 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకునేవాడు. కానీ ఇప్పుడు సునీల్ హీరో కాదు. అతను ప్రధాన పాత్రలలో తీవ్రంగా ప్రయత్నించిన తరువాత సహాయక నటుడిగా మారిపోయాడు. సునీల్ తాజాగా 'డిస్కో రాజా'లో విలన్ గా అడుగుపెట్టాడు. 'కలర్ ఫోటో' అనే రాబోయే ఫిల్మ్ లో కూడా మళ్ళీ విలన్ రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం సునీల్ తన సినిమాలకు పూర్తి రోజు కాల్ షీట్ కోసం రూ. 2 లక్షలు తీసుకుంటున్నాడు. సునీల్ మళ్లీ ఇండస్ట్రీలో సహాయక నటుడిగా బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, కామెడీ పాత్రలు ఆశించినంత పండటం లేదు. ఇకపోతే, సునీల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న # PSPK27 లో కనిపించనున్నాడు. దర్శకుడు క్రిష్ తనకు ఒక ముఖ్యమైన పాత్రను ఇచ్చారని ఆ వర్గాలు చెబుతున్నాయి.