
బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో సక్సెసఫుల్ గా మూడు సీజన్లు పూర్తయ్యి ఇప్పుడు నాలుగు సీజన్ ను చివరి దశకు తీసుకొచ్చారు. పెద్దగా తెలియని వాళ్ళను తీసుకొచ్చి 100 రోజులు షోను నడపడం అంటే ఆషామాషీ కాదు. మధ్యలో కొంత గాడి తప్పిన మళ్ళీ షోపై ఆసక్తి పెరిగేలా ట్విస్ట్లు ఇస్తూ రసవత్తరంగా సాగిస్తున్నారు. కరోనా సమయంలో అసలు షోనే స్టార్ట్ అవ్వదనుకున్నప్పుడు మొదలు పెట్టి దాన్ని ఎంతో ఆసక్తికరంగా మలుస్తూ మొత్తానికి చివరి దశకు తెచ్చారు. మరి కొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే ఉండనున్న నేపధ్యంలో యాజమాన్యం భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గత సీజన్ ఫినాలేకు మెగాస్టార్ వచ్చి సర్ప్రైజ్ చేయగా ఈసారి ఫినాలేకి సూపర్ స్టార్ మహేష్ బాబును తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కొత్త కొత్త హంగులతో, భారీ సెట్టింగ్ తో టిఆర్పిలు బద్దలయ్యేలా చేయాలనీ టీం ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది.