
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకడు. వచ్చిన మొదట్లో ప్రయాణం అంత సాఫీగా లేకపోయినా ఆ తర్వాత "సుప్రీం"తో నెమ్మదిగా హిట్ పడింది. అప్పటి నుంచి సుప్రీం హీరోగా పిలవబడే ధరమ్ తేజ్ కు కొన్నాళ్ల పాటు ప్లాప్‌లు తప్పలేదు. మళ్ళీ "చిత్రలహరి"తో బయట పడ్డాడు. కొత్త దర్శకులు కన్నా అనుభవం ఉన్న హిట్లు ఉన్న దర్శకులైతే బెటర్ అని ఫ్యామిలీ డైరెక్టర్ మారుతితో "ప్రతిరోజు పండగే" సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కధలో కొత్తదనం లేకపోయినా కామెడీ, ఎమోషన్స్ బాగుండటంతో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు వరసగా రెండు సినిమాల విజయంతో మంచి ఊపు మీదున్న తేజ్ తన తదుపరి సినిమాకి రంగం సిద్ధం చేసాడు. ప్రస్థానం, ఆటోనగర్ వంటి చిత్రాలను తెరకెక్కించిన దేవకట్టతో తేజ్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా రెగులర్ షూటింగ్ మార్చ్ 2020 నుంచి మొదలు కానుంది. దేవకట్ట కథల్లో కంటెంట్ ఉన్నప్పటికీ ఆయన తీసిన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్ అయ్యాయి. అయినా సరే సినిమా చేస్తానని ముందుకొచ్చిన తేజ్ కు హిట్ పడుతుందేమో చూడాలి.