
కరోనా లాక్ డౌన్ అన్లాక్ 3.0 లో భాగంగా థియేటర్స్ తెరుస్తారని అంతా భావిస్తున్నారు. ఆగస్టు 1వ తేది నుండి సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతాయని ఆశ పడుతున్నారు. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల రీత్యా థియేటర్స్ అప్పుడే ఓపెన్ చేస్తే పెద్ద ముప్పు ఎదురవుతుందని తెలుగు ఇండస్ట్రీ బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు తెలిపారు. మూడు గంటల పాటు ఒకే చోట కూర్చొని సినిమా చూడాల్సి ఉంటుంది, దింతో కరోనా త్వరగా వ్యాప్తిచెందే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ప్రాణహాని జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే కరోనాకు విరుగుడు వచ్చేంత వరకు, కేసులు తగ్గేంత వరకు తెలుగు రాష్ట్రాల్లో అయితే థియేటర్స్ ఓపెన్ చెయ్యమని తేల్చి చెప్పారు. దింతో సినిమాలు, షూటింగ్ లు లేకుండా ఎం చేయాలాని ఆలోచిస్తున్నారు నటి నటులు, దర్శకులు, నిర్మాతలు.