
గత రెండేళ్ల నుంచి OTTలు ఉప్పందుకుంటున్న తరుణంలో కరోనా మహమ్మారి రావటంతో ఒక్కసారిగా సునామిలాగా ఎగిసిపడ్డాయి. నెటిజన్లు, బయటకు పరిస్థితి లేకపోవటంతో ఎంటర్టైన్మెంట్ కోసం OTT పైనే ఆదారపడుతున్నారు. అందుకే గత ఏడాది టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సొంతగా 'ఆహా' అనే పేరుతో OTTను ప్రారంభించారు. ఇప్పుడు ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలని మరో బడా ప్రొడ్యూసర్ అనుకున్నటున్నట్లు తెలుస్తుంది. అతనే నిర్మాత సురేష్ బాబు. త్వరలో సొంత OTT ప్లాట్ఫార్మ్ ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఇది ఎప్పుడు కార్యాచరణలోకి వస్తుందో చూడాలి.