
జాతీయ అవార్డు గ్రహీత నటి కీర్తి సురేష్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అందం, అభినయం కలిగి ఉన్న నటీమణులలో ఒకరు. ప్రస్తుతం, ఆమె చేతిలో భారీ బడ్జెట్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో సరికొత్త సమాచారం ప్రకారం, కీర్తి సురేష్ తల్లి అయిన మేనక 1981లో నటించిన చిత్రం 'నేత్రి కన్నే' యొక్క రీమేక్‌లో ఆమె తల్లి మేనక పాత్రలో కీర్తి సురేష్ నటించేందుకు సిద్ధంగా ఉంది. ఈ రీమేక్‌లో కీర్తి సురేష్ కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో రొమాన్స్ చేయనుంది. ఈ చిత్ర ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. కీర్తి సురేష్ ఆమె తల్లి మేనక పాత్రను పోషించడానికి రెడీ అవుతోంది. ఆనాడు మేనక, రజనీకాంత్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు ధీనుష్ కీర్తి సురేష్‌తో కలిసి అదే మ్యాజిక్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. గతంలో, ధనుష్ మరియు కీర్తి సురేష్ కలిసి ‘తోడారి’ అనే సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి వారు ఈ ప్రాజెక్ట్ కోసం జత కడుతున్నారు. తన మామ పాత్రను తిరిగి పోషించడమే కాకుండా, ధనుష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.