
కరోనా కల్లోలం ఇంకా అయిపోలేదు. ఒక సంవత్సరం కరోనా ప్రపంచాన్ని వెనక్కి నేటేసింది. అందుకే మాస్క్లు ధరిస్తూ, చేతులు శుభ్రపరుచుకుంటూ మన పనులు మనం చేసుకుంటున్నాం అంతే కానీ కరోనా ఇంకా అంతమవ్వలేదు. వాక్సిన్ వచ్చినప్పటికీ అది అందరికి అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా సమయం పడుతుంది. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు, రిలీజ్ లు అన్ని వాయిదా పడి ఇప్పుడిప్పుడే మళ్ళీ అన్ని మొదలవుతున్నాయి. ఈనేపథ్యంలో ఎంతోమంది షూటింగ్స్ లో పాల్గొంటున్నారు అందులో కొంతమంది కరోనా భారిన పడుతున్నారు కూడా. తాజాగా తమిళ స్టార్ హీరో తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరో సూర్య కూడా కరోనా భారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆదివారం అర్ధరాత్రి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 'నేను కరోనాతో బాధపడుతున్నాను. తర్వగానే కోలుకుంటున్నా. మన జీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదనే విషయం గమనించాలి. భయాన్ని వదిలా జాగ్రత్తలు పాటిస్తే మంచిది. అంకితమైన సహాయక వైద్యులకు ప్రేమ మరియు ధన్యవాదాలు’’ అని తెలియజేస్తూ హీరో సూర్య ట్వీట్ చేశారు.