
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "మహర్షి" మంచి విజయాన్ని సాధించింది. క్లాస్ పాత్రలో కనిపించి మెప్పించాడు మహేష్ బాబు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మొదటిసారి మేజర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచయని చెప్పక తప్పదు. ఇందులో మహేష్ సరసన మొదటిసారి రష్మీక నటిస్తుంది. అంతేకాదు ఈ సినిమాతో తెలుగు తెరకు దూరమైన సీనియర్ నటి విజయశాంతి రిఎంట్రీ ఇవ్వనుంది. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి11న రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి రిలీజ్ వరకు ప్రతి సోమవారం సినిమాకు సంబంధించి ఏదోక అప్డేట్ వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది దీంతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.