
కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో స్తంభించిపోయాయి. అందులో మరి ముఖ్యంగా సినిమాలు, షూటింగ్‌లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. విడుదల కావాల్సిన సినిమాలు ఆగిపోయాయి, షూటింగ్‌లు చేయలేని పరిస్థితి. అందుకే చాలామంది తారలు OTT భాట పడుతున్నారు. డైరెక్టర్లు. నటి నటులు వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సమంత, నిత్య మీనన్, తమన్నా, నవదీప్, సందీప్ కిషన్ లాంటి ప్రముఖ నటులు వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టగా తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ జాబితాలోకి చేరనున్నట్లు తెలుస్తుంది. అయితే సూర్య ఒకే వెబ్ సిరీస్ లో తొమ్మిది మంది డైరెక్టర్లతో పని చేయనున్నాడు. అంటే ఒకే వెబ్ సిరీస్ లో ఒకో ఎపిసోడ్‌ను ఒకో డైరెక్టర్ డైరెక్ట్ చేయనున్నారు. ఆ తొమ్మిది దర్శకుల్లో మని రత్నం, గౌతమ్ మీనన్ లాంటి ప్రముఖులు ఉన్నారు.