
సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా' డైరెక్ట్ తెలుగు సినిమా కాకపోయినప్పటికీ సూర్య తెలుగు ప్రేక్షకులకు అభిమాన హీరో కాబట్టి సినిమాను బాగా ఆదరించారు. అమెజాన్ ప్రైమ్ చాలా కాలానికి ఒక హిట్ అందుకుంది. ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ఫెయిల్ అయ్యాయి. ఇక ఇప్పుడు సూర్య నటించిన ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరు అబ్బా! సూర్య ఎం చేసాడు! అనే అంటున్నారు. ఆ లెవల్ లో పెర్ఫామెన్స్ ఇరగతిసాడు. అయితే సినిమాలో నటి నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చెయ్యగా ఒక్కటి మాత్రం మైనస్ గా కనిపిస్తుంది. అదే సూర్య డబ్బింగ్. ఇన్నేళ్ల నుంచి సూర్యకు శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెప్పారు కాబట్టి సూర్య అనగానే అయన గొంతే గుర్తొస్తుంది. కానీ ఈసారి యాక్టర్ సత్యదేవ్ డబ్బింగ్ చెప్పడంతో కొత్తగా, వింతగా ఉంది. సూర్యకు ఈ గొంతు పెద్దగ సెట్ అవ్వలేదనిపిస్తుంది.