
బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సుసైడ్ మిస్టరీకి ఒక ముగింపు దొరకట్లేదు. ఈ కేసులో రోజుకు చాలా సందేహాలు, మలుపులు చెలరేగుతున్నాయి. చాలా మంది నటి రియా చక్రబర్తి సుశాంత్ మరణానికి అంతిమ కారణమని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆమె అతన్ని కేవలం సినిమా ఆఫర్లు, డబ్బు కోసం ఉపయోగించుకుని, అతనికి బాధను మిగిల్చిందని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు సుశాంత్ కింద పని చేసిన మాజీ వర్కర్ అంకిత్ ఆచార్య తన పెంపుడు కుక్క ఫడ్జ్ బెల్ట్ ఉపయోగించి సుశాంత్ ను హత్య చేశారని ఆరోపించారు. లేకపోతే, పోలీసులు లేకుండా లేదా పోలీసుల కన్నాముందే సుశాంత్ పనివాళ్లు అతని మృతదేహాన్ని ఎందుకు తాకుతారని ఆయన తన వాదనకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కేసు మరింత ఆసక్తికరంగా మారింది. మరి నిజమైన నేరస్థుడు ఎవరో చూద్దాం!