
సుశాంత్ సింగ్ రాజ్పుత్ అతి చిన్న వయసులోనే లోకాన్ని విడిచి వెళ్ళాడు. జూన్ 14న తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని అందరిని షాక్ లోకి నెట్టేశాడు. ఇప్పటికి సుశాంత్ లేడంటే నమ్మడానికి కష్టంగా ఉంది. అయితే అతను నటించిన ఆఖరి సినిమాను 'దిల్ బెచారా' అతనికి నివాళిగా నిన్న ఓటిటి లో రిలీజ్ చేసారు. ఈ సినిమాను అందరూ ఉచితంగా చూసే వెసులుబాటును కలిపించారు. ఒకవైపు సినిమానే ట్రాజెడీ స్టోరీ మీద నడుస్తుంది అలాంటిది మరోవైపు సినిమాలో నటించిన అభిమాన హీరో నిజంగానే లేడు అన్న విషయం మరింత బాధను మిగులుస్తుంది. అయితే సినిమాను అందరూ సుశాంత్ మీద అభిమానంతో, అతనికి నివాళిగా చూస్తే మాత్రం ఇది కచ్చితంగా ఎమోషనల్ రైడ్. అదే సినిమాను సాంకేతికంగా చూస్తే మాత్రం స్క్రీన్ ప్లే సినిమాకు డ్రా బ్యాక్ గా నిలుస్తుంది. హీరో, హీరోయిన్లు అద్భుతంగా నటించినప్పటికీ దర్శకత్వ లోపాలు బలంగా కనిపిస్తున్నాయి. కానీ ఈ సినిమా చూస్తున్నంత సేపు అందరం కేవలం సుశాంత్ మీద అభిమానంతో, అతను లేడనే ఆవేదనతోనే చూస్తాము...అలానే చూద్దాము!