
MS ధోని బయోపిక్ తో యావత్ భారతదేశ యువతని ఒక ఊపు ఊపేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇప్పుడు లేరు అంటేనే చాలా బాధగా ఉంటుంది. అర్ధాంతరంగా ఆయన కథ ముగిసిపోవడం పట్ల చాలా మంది ఇంకా షాక్ లోనే ఉన్నారు. అసలు సుశాంత్ ది ఆత్మహత్యా? లేదా హత్యా? అనే అనుమానాలు లేకపోలేదు. కానీ అడిగి తెలుసుకోవడానికి సుశాంత్ మనతో లేడు కదా! అందుకే తన ఆత్మతో మాట్లాడానని ఒక వ్యక్తి చెప్తున్నాడు. తనతో సుశాంత్ ఆత్మ మాట్లాడిందని స్టీవ్ హుఫ్ అనే వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయనొక పారానార్మల్ యాక్టివిస్ట్. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మతో తాను మాట్లాడినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఆయన ఈ పారానార్మల్ వర్క్ దాదాపు పదేళ్లుగా చేస్తున్నారు. ఇలాంటి పనికోసం స్టీవ్ ఎన్నో పరికరాలు కనుగొన్నారట. వీటి సహాయంతో ఆయన సుశాంత్ ఆత్మతో మాట్లాడినట్టు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చారు. “ఆస్ట్రల్ డోర్ వే” సహాయంతో సుశాంత్ ఆత్మను సంప్రదించానని స్టీవ్ హుఫ్ తెలిపారు. ఈ క్రమంలో తాను రెండు రోజుల క్రితం సుశాంత్ ఆత్మతో మాట్లాడానని తెలిపారు. సుశాంత్ నీది ఆత్మహత్యా? లేక మరి ఏదైనా జరిగిందా? నీ ఫ్యాన్ నీ గురించి అడుగుతున్నారు. నువ్వు చనిపోయాక కూడా నీ గురించే ఆలోచిస్తున్నారు. నువ్వు నీ ఫ్యాన్స్‌కు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటూ స్టీవ్ హుఫ్ సుశాంత్ ఆత్మను పలు ప్రశ్నలు వేసినట్లు తెలిపారు. కానీ సుశాంత్ ఆత్మ ఎలాంటి సమాధానం చెప్పలేదని ఆయన అన్నారు.