
అఖిల్ అక్కినేని తన తదుపరి సినిమా కోసం సురేందర్ రెడ్డితో జతకట్టనున్నారని ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. ఇది అఖిల్ ఐదవ ప్రాజెక్ట్. నాల్గవది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' షూటింగ్ చివరి దశలో ఉంది. సురేందర్ రెడ్డి గత సంవత్సరం చిరంజీవి హీరోగా 'సైరా నరసింహ రెడ్డి' చిత్రంతో ఘన విజయం సాధించారు. అంత భారీ ప్రాజెక్టును నిర్వహించడంలో సురేందర్ రెడ్డి సక్సెస్ అయ్యారని ప్రశంసలు అందుకున్నారు. అయితే అఖిల్ 5వ సినిమాను సుమారు 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ ఒక స్పై థ్రిల్లర్ అని సమాచారం. కాబట్టి ఈ సినిమాకు చాలా విఎఫ్ఎక్స్లు అవసరం. అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం కూడా సురేందర్ రెడ్డి సైరా విఎఫ్ఎక్స్ బృందాన్ని దింపుతున్నారట. ఎలాగైనా అఖిల్ కు హిట్ ఇవ్వాలని సురేందర్ ప్రయత్నిస్తున్నారట.