
సీనియర్ నటి టబు 'అల వైకుంఠపురములో' చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆమె పాత్ర తక్కువే అయినప్పటికీ, ఈ చిత్రంలో ఆమె తన టాలెంట్ ను చాటుకుంది. ఆమె తన పాత్రకు తానే డబ్బింగ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం టబు మరో తెలుగు సినిమాలో అవకాశం దక్కించుకుంది. బాలీవుడ్ హిట్ చిత్రం 'అందాధున్'ను మెర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. అయితే, అసలు అందాదున్ లో టబు చేసిన పాత్రను తెలుగులో కూడా టబు తిరిగి పోషించనున్నట్లు చెబుతున్నారు. మొదట అనసూయ టబు పాత్రను పోషిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సీనియర్ నటి అయితేనే బాగుంటుందని భావించిన మేకర్స్ టబును సంప్రదించారు. అందాదున్ లో టబు పాత్ర ఒక సీనియర్ హీరోకి భార్య. ఆమె పాత్ర సినిమాలో బోల్డ్ గా ఉంటుంది. ఈ సినిమా కోసం ఆమెకు పెద్ద మొత్తంలో చెల్లించారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.