
జనవరి 12 న విడుదలైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన ఫ్యామిలీ డ్రామా "అల వైకుంఠపురములో" సినిమాతో చాలా కాలం తర్వాత టబు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తుంది. అయితే టబు ఈ సినిమాకు హిందీ సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ తీసుకున్నట్లు తెలుస్తోంది. 'అల వైకుంఠపురములో' చిత్రంలో తన 15 నిమిషాల పాత్రకు టబు 3 కోట్ల రూపాయల పే చెక్ తీసుకుందట. కొందరు ఆమె పాత్ర అంతగా ఆకట్టుకోలేదని అన్నా...కొందరు మాత్రం ఆమె ఉండడం వల్ల సినిమాకి ప్లస్ అయిందని అంటున్నారు. అల...వైకుంఠపురములో నిర్మాతలు టబుకు వేతనంగా 3 కోట్ల రూపాయలు చెల్లించారు. అయితే ఆశ్చర్యకరంగా, మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు'తో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతికి కూడా అంతే వేతనాన్ని ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి పాత్రతో పోలిస్తే అల..వైకుంఠపురములో టబు పాత్ర చిన్నది అయినప్పటికీ, రెమ్యునరేషన్ ఇద్దరికీ సమానంగానే వచ్చాయి.